చిత్రం :బిందాస్ రేటింగ్ :3/5 ట్యాగ్ లైన్ :విజయ్(success)గాధ జెనర్ :యాక్షన్ బ్యానర్ :ఏ.కె.ఎంటర్టైన్మెంట్ క్యాస్టింగ్ :మంచు మనోజ్ ,షీనా శేహబ్ది,ఆహుతి ప్రసాద్ ,జయ ప్రకాష్ రెడ్డి,పరుచూరి ,సునీల్ ,బ్రహ్మానందం తదితరులు మ్యూజిక్ :బోబో శశి నిర్మాత :సుంకర రామబ్రహ్మం దర్శకత్వం :వీరు పొట్ల సినిమాటోగ్రఫీ :రమేష్ బాబు
|
|
|
|
| బిందాస్ రివ్యూ |
అజయ్ (మనోజ్) చిత్తూర్ జిల్లా లో ని ఒక డబ్బున్న కుటుంబానికి చెందిన వాడు .తన తండ్రి ఒక ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోతాడు ,తన అత్త కి రెండు కుటుంబాల్ని కలుపుతానని ఒట్టు వేస్తాడు .ఆ ఊరిలో శేషాద్రినాయుడు (జయప్రకాష్ రెడ్డి ) ,మహేంద్రనాయుడు (ఆహుతి ప్రసాద్ ) ఒకే వర్గానికి చెందిన బలమైన నాయకులు .అందుకే పార్టీ కూడా రొటేషన్ పద్ధతిలో ఒకసారి ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే .మరోసారి ఇంకొకరికి టికెట్ ఇస్తుంది .అయితే ప్రజల్లో ఉన్న ఇమ్మేజ్ దృష్ట్యా రెండోసారి కూడా మహేంద్రనాయుడికే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తుంది .దీంతో ప్రత్యర్ధి వర్గం గొడవకు దిగుతారు శేషాద్రినాయుడు బావను హత్య చేస్తారు .దీంతో మహేంద్రనాయుడు ఫ్యామిలీ లో ఒకరినైనా చంపాలని అందుకోసం ఎదురుచూస్తుంటారు ప్రత్యర్ధులు .దీంతో బంధువర్గానికి కూడా ముప్పు ఉండడంతో వారని తీసుకొని వేరే చోటకి వెళ్తాడు శేషాద్రినాయుడు .ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్న తమ్ముడు కొడుకు అజయ్ (మనోజ్) కూడా వాళ్ళతో కలిసి ఉంటాడు .ఫస్ట్ హాఫ్ అంత అజయ్ అల్లరి పనులతో సరదాగా సాగుతుంది .అందరిని ఆటపట్టిస్తూనే తన మరదలైన గిరిజ (షీన) ని కూడా ఆటపట్టిస్తుంటాడు .ఇంతలో తననుఅసహ్యించుకునే గిరిజ ప్రేమను గెలుస్తాడు . ఇక సెకండ్ హాఫ్ కి వొస్తే కత్తులతో పగలతో దూసుకుంటున్న ఈ రెండు కుటుంబాలని కలిపే భాద్యత హీరో తన స్వహస్తాల ఫై వేసుకుంటాడు .ఇందుకు సంభందించి శేషాద్రినాయుడు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ మనసులను గెలుస్తాడు .రెండు కుటుంబాలని ఒకటి చేస్తాడు.
సాంగ్స్ ఎనాలిసిస్: బోబో శశి అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .ముక్యంగా గిరిజ ... సాంగ్ హైలెట్ గ నిలిచింది. కళాకారుల నైపుణ్యం: మనోజ్ నటన ప్రేక్షకులను మరింతగా ఆకర్షింది .డైరెక్టర్ వీరు పొట్ల గారు ఫైట్స్ లో ను అటు యాక్టింగ్ పరంగా చాల ఎనర్జిటిక్ గ మనోజ్ ని చూపించారు .హీరోయిన్ షీన చిన్న పిల్లలా అనిపించినా మనోజ్ సరసన గుడ్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది టాలీవుడ్ లో తన మొదటి సినిమా కే ఎంతో ఇమేజ్ సంపాదిస్తుందని అనుకొవొచ్చు .మాస్టర్ భరత్ టాయిలేట్ సన్నివేసం ,పకీరు సాహెబ్ గ ఏం.ఎస్.నారాయణ కామెడి స్కామ్లతో గందరగోళంలో పడే బ్రహ్మానందం పాత్ర ముద్దుకృష్ణ గ 'వెన్నెల' ఫేం కిషోర్ ఈ చిత్రం లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు .కార్ చేజింగ్ ఈ చిత్రానికి హై లైట్ గా నిలిచింది .డైరెక్టర్ వీరు పొట్ల పంచ్ డైలాగ్స్ హాస్యంగా సాగింది. మిగత పాత్రలో నటించిన జయ ప్రకాష్ రెడ్డి,ఆహుతి ప్రసాద్,రఘుబాబు తదితరులు తమ తమ పాత్రలకు జీవం పోసారు . టెక్నికల్ ఎనాలిసిస్: రమేష్ బాబు అందించిన సినిమాటోగ్రఫీ,ఫిలిం ఎడిటింగ్,మరియు స్క్రీన్ ప్లే చాల చక్కగా కుదిరాయని చెప్పుకోవోచు . మనసిని ఎనాలిసిస్: పేరుకి తగట్టుగానే ఈ సినిమా మంచి కమర్షియాల్ ఎలెమెంట్స్ తో బిదాస్ గా మాస్ ప్రేక్షకులకే కాకుండా అన్ని వర్గాల వారిని కూడా ఈ సినిమా అలరిస్తుంది
|
|
|