సీతారాముల కళ్యాణం లంకలో
Reviews
SEETARAMULA KALYANAM REVIEW
చిత్రం :సీతారాముల కళ్యాణం లంకలో
రేటింగ్ :2/5
ట్యాగ్ లైన్ :ఆకట్టుకొని కళ్యాణం
జెనర్ :యాక్షన్
బ్యానర్ :వెల్ఫేర్ క్రియేషన్స్
క్యాస్టింగ్ :నితిన్, హన్సిక, బ్రహ్మనడం, ఎం.ఎస్. నారాయణ, సుమన్, వేణు మాధవ్, సునీల్ పండ తదితరులు
మ్యూజిక్ :అనూప్ రూబెన్స్
నిర్మాత :మల్ల విజయ్ ప్రసాద్
దర్శకత్వం : ఈశ్వర్
సినిమాటోగ్రఫి :ఎం. జోషి
                
బిందాస్
సీతారాముల కళ్యాణం లంకలో
సలీం
ప్రవరాఖ్యుడు
అమరావతి
ఆర్య-2
కుర్రాడు
అ ఆ ఇ ఈ
విలేజ్ లో వినాయకుడు
ఏక్ నిరంజన్
ఈనాడు
బాణం
శంఖం
జోష్
ఆంజనేయులు
more...
సీతారాముల కళ్యాణం లంకలో రివ్యూ
ఒక రోజు చందు (నితిన్) బస్ స్టాప్ లో సిగరెట్ తాగుతుండగా నందిని(హన్సిక) వచ్చి నలుగురిలో సిగరెట్ తాగడం చట్ట రిత్యా నేరం అని భారీ క్లాస్ పీకుతుంది. మొదటి సారి నందు ని చూసిన చందు లవ్ పడుతాడు. వెంటనే ఆమెకు "ఐ లవ్ యు" అని చెబుతాడు. మొదట్లో ఆమె తిరస్కరించిన తర్వాత చందు ప్రేమను ఒప్పుకుంటుంది. ఒక సారి పెళ్లి వీడియో లో నందిని ని జయ ప్రకాష్ రెడ్డి తమ్ముడి కొడుకు అయిన వీర ప్రతాప్ రెడ్డి చూస్తాడు. దీంతో నందిని ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వీరప్రతాప్. వీర ప్రతాప్ రెడ్డి తో పెళ్లి కి నిరాకరించిన నందు ని బలవంతంగా ఆళ్లగడ్డ కి ఎత్తుకేల్తాడు. ఈ విషయం తెలుసుకున్న చందు వీర ప్రతాప్ దగ్గర నమ్మిన బంటుగా చేరుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? నందు, చందు అక్కడి నుంచి ఎలాబయటపడుతారు? చందు, నందిని ల పెళ్లి ఏమైంది అన్నది వెండి తెరపై చూడాలి.
సాంగ్స్ ఎనాలిసిస్: అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఏ ఒక్క పాట కూడా వినసొంపుగా లేవు.
కళాకారుల నైపుణ్యం: "సై" సినిమా తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతవతున్న నితిన్ కు ఈ సినిమా కాస్త ఊరట తెచ్చింది. ఈ సినిమాలో తన నటన ఏ మాత్రం కొత్తగా లేదు. కాని హీరోయిన్ హన్సిక మాత్రం ఈ సినిమాలో మరో సారి అందానికి ప్రముఖ్యలో ఉన్న పాత్రలో నటించి సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో ఎం.ఎస్. నారాయణ(రిస్క్ రాంబో) గా చేసిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎం.ఎస్. నారాయణ, "అతడు" లో (మహేష్ బాబు) ను ఇమిటేట్ చేస్తూ చేసిన కామెడీ సినిమా కి హై లైట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం కామెడీ కూడా సినిమా కి మంచి అసెట్ గా నిలిచింది. మిగత పాత్రలో నటించిన జయ ప్రకాష్ రెడ్డి, వీర ప్రతాప్, సుమన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ ఎనాలిసిస్: ఎం. జోషి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. అలాగే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా నీట్ గా ఉంది.
మనసిని ఎనాలిసిస్: వరుస ఫ్లాప్ లతో సతమతవుతున్న నితిన్ కు ఈ సినిమా కాస్త ఊరట కలిగించిన, అగ్ర హీరో ల సినిమాలు రిలీజ్ కావడంతో ఈ సినిమా ఆ సినిమాల సరసన చేరుతుందో లేదో వేచి చూడాలి.
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved