సలీం
Reviews
SALEEM REVIEW
చిత్రం : సలీం
రేటింగ్ :1.5/5
ట్యాగ్ లైన్ :సలీం ఓడిపోయాడు
జెనర్ :యాక్షన్
బ్యానర్ :శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
క్యాస్టింగ్ : విష్ణు, ఇలీయాన, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు
మ్యూజిక్ :సందీప్ చౌతా
నిర్మాత :మోహన్ బాబు
దర్శకత్వం :వై.వి.యస్ చౌదరి
సినిమాటోగ్రఫి :సి. రామ్ ప్రసాద్
                
బిందాస్
సీతారాముల కళ్యాణం లంకలో
సలీం
ప్రవరాఖ్యుడు
అమరావతి
ఆర్య-2
కుర్రాడు
అ ఆ ఇ ఈ
విలేజ్ లో వినాయకుడు
ఏక్ నిరంజన్
ఈనాడు
బాణం
శంఖం
జోష్
ఆంజనేయులు
more...
సలీం రివ్యూ
డబ్బు కోసం ఏ ఏ పనైనా చేస్తూ కాసినో ఓనర్ గా యూరోప్ లో ఉంటాడు ఓజో(మోహన్ బాబు). ఇతని తమ్ముడు క్రిష్, సత్య(ఇలీయాన) ప్రేమికులు. సత్య తండ్రి సింగనమల నాయుడు(నెపోలియన్). తల్లి దండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న సత్య 14 ఏళ్ళ తర్వాత ఇండియా కు తిరిగి వస్తుంది. ఇక్కడ సత్య కుటుంబ సభ్యుల ప్రత్యర్థులు అప్పలనాయుడు(ముకేష్ రుషి), సత్య రావడం తెలుసుకొని ఆమె పై దాడి చేస్తారు. కాని యూరోప్ లో మొదటి చూపులోనే ప్రేమించిన సలీం(విష్ణు) ఆమె వెనకాలే ఇండియా కు వస్తాడు. అయితే ప్రత్యర్థుల నుండి సత్యను కాపాడి వాళ్ళ ఇంట్లో మున్నా గా పేరు మార్చుకొని చేరుతాడు. సింగనమల నాయుడు మిత్రుడు గిరిబాబు బ్యాంకాక్ నుంచి సత్యకు పెళ్లి సంబంధం తీసుకువస్తాడు. కాని సంబంధానికి వచ్చిన వాళ్ళను సింగనమల నాయుడు ప్రత్యర్ధి అప్పలనాయుడు చంపించి, వారి స్థలం లో వేరే వాళ్ళను పంపుతాడు. ఈ విషయం తెలుసుకున్న మున్నా వచ్చిన వాళ్ళను చంపేస్తాడు. క్రిష్ ను పెళ్ళిచేసుకోవడానికి సత్య, మున్నా ను పాము లాగా ఉపయోగించుకొని యూరోప్ చేరుకుంటుంది. క్రిష్, సత్య నిశ్చితార్ధం చేసుకుంటున్న స్థలానికి వెళ్ళిన మున్నా ను చూసి ఓజో గుర్తుపట్టి తను మున్నా కాదని సలీం అని గతం గుర్తుచేస్తాడు. ఇంతకీ సలీం ఎవరు? ఓజో కి సలీం కి సంబంధం ఏముంది? క్రిష్, సత్య ల నిశ్చితార్దం జరిగిందా అన్నది తెరపై చూడండి.
సాంగ్ ఎనాలిసిస్: ఈ సినిమాలో పాటలు బాగా లేవు, ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
కళాకారుల నైపుణ్యం: సన్నగా పొడుగ్గా ఉండే ఇలీయాన తన సన్నని నడుమును ఎన్ని వంకర్లు అంటే అన్ని వంకర్లు తిప్పి అందరిని బాగా ఆకట్టుకుంది. చాలా గ్లామరస్ గా కనిపించింది. ఇక ఇలీయాన తర్వాత ఆకాట్టుకుంది మోహన్ బాబు నటన. ఈ సినిమాలో కామిడి విలన్ గా కనిపించరు. కావేరి ఝా, మోహన్ బాబు మధ్య సన్నివేశాలు ఎంటర్ టైన్మెంట్ చేసాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, కొడుకు విష్ణు కన్నా అందంగా కనిపించారు. ఇక హీరో విష్ణు చాల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఇందులో విష్ణు చాలా స్మార్ట్ గా కనిపించరు.
టెక్నికల్ ఎనాలిసిస్: ఈ సినిమాలో మ్యూజిక్ బాగా లేదు. దర్శకుడు వై.వి.యస్ చౌదరి మరోసారి తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోలేకపోయారు. సి. రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫి పరవాలేదు.
మనసిని ఎనాలిసిస్: మూడు గంటలు సేపు బోర్ కొట్టించే సినిమా.
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved