ప్రవరాఖ్యుడు
Reviews
PRAVARAKHYUDU REVIEW
చిత్రం :ప్రవరాఖ్యుడు
రేటింగ్ :2.5/5
ట్యాగ్ లైన్ :పాత కథ కొత్త పనితీరు
జెనర్ :లవ్ అండ్ రొమాంటిక్
బ్యానర్ :టాలీ టూ హాలీ మూవీస్
క్యాస్టింగ్ :జగపతి బాబు, ప్రియమణి, హంస నందిని, అలీ, సునీల్, బ్రహ్మానందం, చలపతి రావు తదితరులు
మ్యూజిక్ :ఎం.ఎం. కీరవాణి
నిర్మాత :గణేష్ ఇందుకూరి
దర్శకత్వం :మదన్
సినిమాటోగ్రఫి :సురేందర్ రెడ్డి
                
బిందాస్
సీతారాముల కళ్యాణం లంకలో
సలీం
ప్రవరాఖ్యుడు
అమరావతి
ఆర్య-2
కుర్రాడు
అ ఆ ఇ ఈ
విలేజ్ లో వినాయకుడు
ఏక్ నిరంజన్
ఈనాడు
బాణం
శంఖం
జోష్
ఆంజనేయులు
more...
ప్రవరాఖ్యుడు రివ్యూ
అమెరికా యునివర్సిటీ లో లెక్చరర్ గా పనిచేసి ఇండియా కు తిరిగివస్తాడు శశి(జగపతిబాబు). ఎన్నో పెళ్లి సంబంధాలు చూసిన నచ్చలేదని అంటూ ఉంటాడు. శశి స్నేహితుడైన రవి(సునీల్) గతంలో శశి జీవితంలో జరిగిన లవ్ అఫ్ఫైర్ గురించి గుర్తుచేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఒకే కాలేజి లో పి.జి. చదువుతుంటారు శశి(జగపతిబాబు) శైలజ(ప్రియమణి). ఒకసారి అనుకోని సందర్భంలో శశి, శైలజను ముద్దు పెట్టుకుంటాడు. అప్పటి నుంచి శైలజ, శశి ని ప్రేమిస్తుంది. కాని శశి అందంత ఏమి లేదని చెపుతాడు. దాంతో శైలజ, శశి ని అసహించుకోని కాలేజీ నుండి వెళ్ళిపోతుంది. చాలా కాలం తర్వాత అమెరికా నుండి తిరిగివచ్చిన శశి కి, శైలజ పెళ్లైపోయిందని తెలుసుకుంటాడు. కాని ఆమెకు పెళ్లి కాలేదని ఒక లేడీస్ కాలేజీ లో ప్రిన్సిపాల్ గా ఉందని తెలుసుకొని ఆమె ప్రేమను దక్కించుకోవడానికి అదే కాలేజీ లో లెక్చరర్ గా చేరతాడు. అయితే మరి శశి ప్రేమను శైలజ అంగీకరించిండా లేదా అనేది తెరపై చూడాలి.
సాంగ్స్ ఎనాలిసిస్: ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం బాగుంది. పిక్చరైజేషన్ బాగుంది. పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కళాకారుల నైపుణ్యం: స్టూడెంట్ పాత్రలో మరియు లెక్చరర్ పాత్రలో జగపతిబాబు చాలా చక్కగా నటించారు. ఇక ఎప్పటిలాగే ప్రియమణి చాలా గల్మరాస్ గా ఈ సినిమాలో కనిపించింది. సునీల్, హంస నందిని పాత్రలు ఎక్కువ సేపు లేకపోయినా ఉన్నంతవరకు అయిన ఇద్దరు బాగా నటించి వారి పాత్రలకు న్యాయం చేశారు. కామెడీ విషయంలో అలీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బ్రహ్మానందం, ధర్మవరపు పరవాలేదనిపించింది. చలపతి రావు, రాజ్యలక్ష్మి బాగా నటించి వారి, వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ ఎనాలిసిస్: మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. సురేందర్ రెడ్డి ఫోటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఒక చక్కటి కథతో మదన్ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే బాగుంది.
మన సిని ఎనాలిసిస్: కథలో కొత్తదనం లేదు. కాని పిక్చరైజేషన్ అన్ని చక్కగా చూపించారు. కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా.
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved