చిత్రం :ఆర్య-2 రేటింగ్ :3.5/5 ట్యాగ్ లైన్ :మిస్టర్ పెర్ఫెక్ట్ జెనర్ :లవ్ అండ్ యాక్షన్ బ్యానర్ :ఆదిత్య ఆర్ట్స్ క్యాస్టింగ్ :అల్లు అర్జున్, కాజల్, నవదీప్, శ్రద్ధ దాస్, బ్రహ్మానందం, అజయ్, షాయాజీ షిండే, ముకేష్ రుషి తదితరులు మ్యూజిక్ :దేవి శ్రీ ప్రసాద్ దర్శకత్వం :సుకుమార్ నిర్మాత :ఆదిత్య బాబు, బి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ సినిమాటోగ్రఫి :రాజ శేఖర్
|
|
|
|
| ఆర్య-2 రివ్యూ |
ఆర్య(అల్లు అర్జున్), అజయ్(నవదీప్) చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ అనాదలు. ఒక అనాధ శరణాలయం లో పెరుగుతారు. ఒక గొప్పింటి కుటుంబం వారు అనాధ శరణాలయం కి వచ్చి వీరిద్దరిలో ఒకరిని దత్తతు తీసుకోవాలనుకుంటారు. అయితే ఆర్య, అజయ్ ప్రతి విషయంలోనూ పోటి పడుతారు. దత్తత విషయంలో కూడా పోటి పడి ఎప్పటిలాగే వీరు టాస్ వేసుకుంటారు(ఆర్య గెలిస్తే అజయ్ వెళ్ళాలి, అజయ్ గెలిస్తే ఆర్య వెళ్ళాలి). అయితే మళ్లీ ఆర్య గెలుస్తాడు. ఒప్పందం ప్రకారం అజయ్ వాళ్ళతో వెళ్తాడు. అజయ్ సాఫ్ట్ వేర్ కంపెనీ ని స్థాపించి అందులో ఆర్య కి ఉద్యోగం ఇస్తాడు. ఇదే కంపెనీ లో కొత్తగా గీత(కాజల్) అనే అమ్మాయి చేరుతుంది. ఆర్య, అజయ్ లు గీత ను ప్రేమిస్తారు. ఈ విషయంలో కూడా ఆర్య, అజయ్ లు టాస్ వేసుకుంటారు. కాని ఈ సారి అజయ్ గెలుస్తాడు. అజయ్ ప్రేమను త్యాగం చేస్తాడు. కాని గీత మాత్రం అనుకోని సంఘటనల వల్ల అజయ్ ని ప్రేమిస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంలో సాగుతుంది. గీత తండ్రి రాజా రెడ్డి(ముకేష్ రుషి) తన కూతురి పెళ్లి మరో ఫ్యాక్షనిస్ట్ అయిన కాసి రెడ్డి(శయాజీ షిండే) కొడుకు సుబ్బా రెడ్డి(అజయ్)తో నిశ్చయిస్తారు. ఇంతకీ ఆర్య, గీత ల ప్రేమ ఫలించిందా?. అజయ్, గీత ల ప్రేమ ఫలించిందా?. లేద గీత, సుబ్బా రెడ్డి పెళ్లి జరిగింద?. ఇదంతా తెలియాలంటే సినిమాను చూడాలి.
సాంగ్స్ ఎనాలిసిస్: ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. పిక్చరైజేషన్ పరంగా కూడా బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందరిని ఆకట్టుకుంది. "మిస్టర్ పెర్ఫెక్ట్" సాంగ్ బాగుంది. పిక్చరైజేషన్ పరంగా కూడా బాగుంది. "రింగ రింగ" సాంగ్ మాత్రం యావరేజ్ గా ఉంది. ఈ పాటలో లిరిక్స్ ని మార్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్. కళాకారుల నైపుణ్యం: ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా బాగా చేసారు. ఆయన నటన అందరిని ఆకట్టుకుంది. డైలాగ్ చెప్పడంలోను, డాన్స్ లోను బాగా చేసారు. ఇక ఆర్య ఫ్రెండ్ గా చేసిన నవదీప్ చక్కగా నటించారు. క్లైమాక్స్ సీన్ హాస్పిటల్ లో అల్లు అర్జున్ తో చెప్పే డైలాగ్ చాలా బాగా చెప్పారు. కాజల్ అగర్వాల్ చాలా చక్కగా చేసింది. ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. శ్రద్ధ దాస్ గ్లామరస్ గా కనిపించింది. ఒక చిన్న బిట్ లో అజయ్, అల్లు అర్జున్ కామెడీ బాగా నవించింది. బ్రహ్మానందం కామెడీ యావరేజ్ గా ఉంది. టెక్నికల్ ఎనాలిసిస్: "ఆర్య" సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న సుకుమార్ మరో సారి "ఆర్య -2" సినిమా తీసి తన దర్శకత్వ ప్రతిభను అందరికి చాటి చెప్పాడు. రాజ శేఖర్ ఫోటో గ్రఫి హై క్లాస్ లో నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ గా ఉంది. డైలాగ్లుబాగున్నాయి. మన సిని ఎనాలిసిస్: డాన్స్, డైలాగ్లు, నటన తో మళ్లీ మళ్లీ థియేటర్ల వైపు వచ్చేలా చేసింది ఈ "ఆర్య-2"
|
|
|