చిత్రం :కుర్రాడు రేటింగ్ :2/5 ట్యాగ్ లైన్ :బోల్తాపడ్డ కుర్రాడు జేనర్ :యూత్, యాక్షన్ బ్యానర్ :ఆనంది ఆర్ట్స్ క్యాస్టింగ్ :వరుణ్ సందేష్, నేహ శర్మ, తనికెళ్ళభరణి, ఆలీ, సురేఖావాణి, రవిశంకర్, వేణు తదితరులు. మ్యూజిక్ :అచ్చు దర్శకత్వం :సందీప్ గుణ్ణం నిర్మాత :కిరణ్ సినిమాటోగ్రఫి : సర్వేష్ మురారి
|
|
|
|
| కుర్రాడు మూవీ రివ్యూ |
డిగ్రీ పూర్తీ చేసి ఏ ఉద్యోగం లేకుండా తండ్రి తో చివాట్లు తింటూ జల్సాలు చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు వరుణ్(వరుణ్ సందేశ్). అయితే వరుణ్ కి ఒక ఆశ ఉంది. ఒక బైక్ కొనుక్కొని లవర్ తో హాయిగా తిరగాలని. దానికి తండ్రిని బాగా సతాహిస్తాడు. చేసేది లేక కూతురి కోసం దాచి పెట్టుకున్న 70 వెళ్ళు తీసుకొచ్చి కొడుక్కి ఇస్తాడు. దాంతో వరుణ్ బండి కొనుక్కుంటాడు. ఇంతలొ తనకి బ్యాంకు లో ఉద్యోగం వస్తుంది. ఇదే కాకుండా తన ప్రేమ కూడా ఫలిస్తుంది. సాఫీగా నడుస్తున్న వరుణ్ జీవితంలో ఒక రోజు తన బైక్ దొంగతనాకి గురవుతుంది. ఇక తను బైక్ కోసం పడ్డ కష్టాలు అంత ఇంత కాదు. తరవాత ఏమి జరిగింది. తన బండి దొరికిందా? లేదా?. తన ప్రేమ సాఫీగా ముగిసిందా? లేదా? అన్నది వెండాతేరపై చూడాలి.
సాంగ్స్ ఎనాలిసిస్: ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి . అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించారు. కళాకారుల నైపుణ్యం: తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ళ భరణి ఈ సినిమాకి పెద్ద ప్లేస్ పాయింట్. ఆయన నటన చాలా బాగుంది. ఇక హీరో వరుణ్ సందేశ్ లో బాడీ లాంగ్వేజ్ సూట్ కాలేదు. నటన పరవాలేదు. హీరోయిన్ నేహ ఫేస్ లో కల ఉన్న తన పాత్ర స్లోగా సాగింది. ఇక విలన్ పాత్రలో రవి శంకర్ నటన కూడా పరవాలేదనిపించింది.ఫస్ట్హాఫ్కాస్తనవ్వించినసెకండ్హాఫ్అంతగాఆకట్టుకోలేదు టెక్నికల్ ఎనాలిసిస్: గుణ్ణం సందీప్ పనితీరు బాగాలేదు. స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేదు. డైలాగ్స్ పరవాలేదనిపించింది. ఫోటోగ్రఫి ఇంకా బాగా తీసి ఉండొచ్చు. పాటలు తప్ప ఈ సినిమాలో మిగతాది ఏది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మనసినీ ఎనాలిసిస్: ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బోర్ కొడుతుంది.
|
|
|