చిత్రం :అ ఆ ఇ ఈ ట్యాగ్ లైన్ :పాత కథ కొత్త సినిమా రేటింగ్ :1.5/5 జేనర్ :ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్యానర్ : కల్పనా ఆర్ట్స్ క్యాస్టింగ్ : శ్రీకాంత్, మీరా జాస్మిన్, కృష్ణభగవాన్, తణికెళ్ళ భరణి, కవిత, బ్రహ్మానందం, అలీ, సునీల్, కొవే సరళ, తదితరులు. మ్యూజిక్ :ఎమ్.ఎమ్.శ్రీలేఖ దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి నిర్మాత : బొద్దం అశోక్ కుమార్ సినిమాటోగ్రఫి :విజయ్ సి.కుమార్
|
|
|
|
| అ ఆ ఇ ఈ రివ్యూ |
ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు ఇలాంటి సినిమా లు మన తెలుగు చిత్ర సీమలో చాలా కనిపిస్తూనే వున్నాయి. గతంలో జగపతి బాబు ఇలాంటి సినిమా ఒకటి చేశారు. ఇప్పుడు తాజాగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో అ ఆ ఇ ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో నిజాయితిపరుడైన ఓ టాక్సీ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తాడు చంద్రం(శ్రీకాంత్). ఇతని భార్య కళ్యాణి(మీరా జాస్మిన్). ఇలా వీరి జీవితం సజావుగా సాగుతుండగా అనుకోకుండా కళ్యాణి కి జబ్బు వస్తుంది. అది జబ్బు నుండి బయట పడడానికి పది లక్షలు కావలి. ఏమి చేయలేని చంద్రానికి అనుకోని పరిస్థితులలో ఒక డబ్బు ఉన్న సూట్ కేస్ దొరుకుతుంది. దీనితో పాటు ఒక శవం కూడా దొరుకుతుంది. ఏమి చెయ్యాలో అర్ధం కాకా ఫ్రెండ్ (కృష్ణ భగవాన్) సూచన మేరకు ఆ డబ్బును వాడుకుంటాడు చంద్రం. అయితే ఆ సూట్ కేస్ లో రమ్య(సదా) ఫొటో ఉంటుంది. రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ల బాధ చూడలేక అల్లుడిగా ఆ ఇంట్లో అడుగు పెడతాడు చంద్రం. ఇంతలో కళ్యాణి జబ్బు నయం అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఉన్నంటు ఉంది రమ్య వస్తుంది. అయితే ఇంతకీ ఆ శవం ఎవరిదీ, అల్లుడు గా ఆ ఇంట్లో చేరిన చంద్రం పరిస్థితి ఏమైంది, కళ్యాణి పరిస్థి ఏమైంది. ఇదంతా వెండితెరపై చూడాల్సిందే.
సాంగ్స్ ఎనాలిసిస్: ఎమ్.ఎమ్.శ్రీలేఖ అందించిన సంగీతం ప్రేక్షకులకు పరవలేదనిపించాయి. కళాకారుల నైపుణ్యం: ఇలాంటి పాత్ర ఈ మధ్య కాలంలో ఎ హీరో చేసిఉండదు. ఎన్ని సమస్యలు వచ్చిన ఓడిదిడుగులతో ఉంటాడు. హీరో శ్రీకాంత్ పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఇద్దరి హీరోయిన్ ల పాత్రలు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక కామిడి విషయానికి వస్తే బ్రహ్మానందం,కొవై సరళ జంట ఇంతగా ఫెయిల్యూర్ అవటం ఎప్పుడూ జరగలేదనుకుంట. అపూర్వ చేత ఎక్సపోజింగ్ చేయించడం కూడా బాలేదు. ఇక సినిమాకు ఏమన్నా ప్లస్ ఉందా అంటే పాటలు అనే చెప్పాలి. అలీ ది మతిమరుపు పాత్ర. ధియోటర్ బయిటకొచ్చినా ఆ పాత్రను మర్చిపోవటం కష్టమే. టెక్నికల్ ఎనాలిసిస్: దర్శకత్వం బాధ్యతలు చేప్పట్టిన శ్రీనివాస్ రెడ్డి ఫైల్యూర్ అయ్యారు. స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకొని ఉంటె బాగుండు అనిపించింది. ఎడిటింగ్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. మన సిని ఎనాలిసిస్: ఈ సినిమాను టీవిల్లో చూడటం బెస్ట్. ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి మన కిష్టమైన అప్పుడు ఛానల్ మార్చుకోవచ్చు.
|
|
|