సంక్రాంతి కి ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ "అదుర్స్" అంటూ మనముందుకు వస్తే వెంకటేశ్ "నమో వెంకటేశ"తో ప్రత్యక్షమయ్యాడు. ఈ రెండు సినిమాల్లో "అదుర్స్" బాక్సాఫీసు వద్ద అదరగొడితే, "నమో వెంకటేశ" మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. అయితే సంక్రాంతి కి సీజన్ కింగ్ ఎన్టీఆర్ కాదు, వెంకీ కాదు "నేనే" అంటున్నారు బ్రాహ్మి సాఫ్ట్ వేర్ ఇంజినీర్(బ్రహ్మానందం).ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకుడికి ధీటుగా తన పాత్రలు ఉండటం, ఆయా పాత్రల్లో ఆయన ఒదిగిపోయి నటించడంతో ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాల్లో కథానాయకుడి కన్నా బ్రహ్మికే ఎక్కువ మార్కులు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతగా ఆయన నవ్వించాడు. ఇంకో విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకూ బ్రహ్మానందం కథానాయికల కన్నా అధిక పారితోషికం పొందాడట. "నమో వెంకటేశ" సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటే "అదుర్స్" సినిమాకు 80 లక్షల చొప్పున పారితోషికం పొందారని సమాచారం.
Tags :
Namo Venkatesa Songs,
Adurs Songs,
NamoVenkatesa Trailer,
Adurs Trailer
|