నందమూరి వంశంలో పుట్టి తాతగారి ఆశీసులతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రేక్షాభిమనంతో తన కంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న జూ.ఎన్టీఆర్ "నిన్ను చూడాలని" సినిమాతో కథానాయకుడిగా కెరియర్ మొదలుపెట్టాడు. ఎన్నో సినిమాలో నటించి రికార్డుల మీద రికార్డు లు బద్దలు కొట్టాడు. తాజాగా నటించిన "అదుర్స్" సినిమా విడుదలై మరో రికార్డు సొంతం చేసుకున్నాడు జూ.ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన దిల్ రాజు గారి సమర్పణలో "బృందావనం" సినిమాలో నటిస్తున్నారు. ఇదే కాకుండా గురువారం తన మరో తాజా చిత్రం "శక్తి" మొదలైంది. అయితే ఈ అందాగాడికి పెళ్లి కల వచ్చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు కూతురు అయిన లక్ష్మి ప్రణతి తో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం పై ఎన్టీఅర్ కుటుంబ సభ్యులు గత సోమవారం మాటామంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జానకి రామ్, కళ్యాణ్ రామ్ హాజరు అయ్యారు. మర్చి లో నిశ్చితార్దం, మే లో పెళ్లి.
Tags :
Ntr Pictures,
Adurs Songs,
Rakhi Songs,
Adurs Trailers
|