త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్

RAM CHARAN IN TRIVIKRAM DIRECTIONతన రెండవ సినిమాతోనే 75 ఏళ్ల తెలుగు సినీచరిత్రలోని అన్ని రికార్డులనూ బద్దలుకొట్టేసిన మగధీరుడు రామ్ చరణ్ తేజ. ఆయన "అతడు" సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ ఓ వాణిజ్య ప్రకటన కోసం కలసి పనిచేయనున్నారు. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఈ సంస్థకు చెందిన ఓ ప్రకటనలో నటించనున్నాడు. ఈ ప్రకటనకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెలలో ముంబైలో ఈ ప్రకటన షూటింగ్ జరుగనుందని సమాచారం. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా త్వరలో ప్రారంభంకానుంది.


Tags : Ramcharantej Pictures, Magadheera Songs, Athadu Songs, Magadheera Review

Head Lines
Gossips
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved