పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "కొమరం పులి" చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేయడానికి శ్రియ అంగీకరించిందని సమాచారం. తెలుగులో నేరుగా చిత్రాలు చేయడం మానుకున్న శ్రియ అడపా దడపా ఐటమ్ సాంగ్స్ మాత్రం చేస్తోంది. "తులసి", "దేవదాసు", "మున్నా", సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో చేసింది. ఇంతకు మునుపే పవన్ కళ్యాణ్ తో "బాలు ఎబిసిడిఇఎఫ్ జి" చిత్రంలో నటించి ప్రేక్షకాదరణ పొందిన విషయం అందరికి తెలిసిందే. సింగనమల రమేష్ నిర్మాణంలో ఎస్. జె. సూర్య దర్వకత్వంలో "కొమరం పులి" చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాల్లో శ్రియ కథానాయిక నటిస్తోంది. ఈ సినిమాలో శ్రియ తో పాటు తమిళ స్టార్ శింబు ను కూడా ఈ సినిమాలో చూడొచ్చు అని దర్శకుడు ఎస్ జె సూర్య చెప్పుకొచ్చారు.
Tags :
Shreya Pictures,
Pavankalyan Pictures,
Sivaji Songs,
Mallannaa Songs,
Jalsa Songs
|