| శరణ్య మోహన్ ఇంటర్వ్యూ |
Interviews |
 |
| కేరళ లో పుట్టి పెరిగి డాన్స్ టీచర్ గా ఒక అకాడెమీ నడుపుతూ అటు మలయాళం, తమిళ్ సినిమాలో నటించి "విలేజ్ లో వినాయకుడు" సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైనా శరణ్య మోహన్ మొదటి సినిమాతో నే అందరి మెప్పు పొందింది. ఈ కేరళ కుట్టి తో కాసేపు..
|
మీ గురించి? నా పేరు శరణ్య మోహన్. మాది కేరళలోని ఆలేప్పి. మా ఇంట్లో మేము నలుగురం. నాన్న పేరు మోహన్, ఆయన క్లాసికల్ డాన్సర్. అమ్మ డాన్స్ టీచర్. ఇక సోదరి సుకన్య మోహన్ కూడా క్లాసికల్ టీచర్. ఆలేప్పి లో మాకు ఒక డాన్స్ అకాడెమీ ఉంది. దాని వై.కే. బి. డాన్స్ అకాడెమీ. నా జీవితం డాన్స్ టీచర్ గా సెటిల్ అవ్వాలని.
|
మీరు సినీ పరిశ్రమకు ఎలా పరిచయం అయ్యారు? తెలుగులో "ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే" సినిమాని తమిళ్లో "యారిదే నీ మోహిని" పేరుతొ రిమేక్ చేశారు. ఆ సినిమాలో నేను తెలుగులో స్వాతి పోషించిన పాత్రను నేను తమిళ్ లో పోషించాను. అప్పుడు దర్శకుడు సాయి కిరణ్ గారు ఈ సినిమాని చూసినప్పుడు "విలేజ్ లో వినాయకుడు" సినిమాకి సూట్ అవుతానని నన్ను ఎంపిక చేశారు. నేను హీరోయిన్ గా తమిళ్ లో "వేన్నిల కబాడీ ఖుజ్జు" అనే చిత్రంలో నటించాను. మలయాళం లో "కెమిస్ట్రి" సినిమా లో నటించాను. ఇక తెలుగులో "విలేజ్ లో వినాయకుడు" సినిమా తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న "భీమిలి" చిత్రంలో నాని సరసన నటిస్తున్నాను. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి మరో సినిమా లో నటిస్తున్నాను.
|
|
మీకు విలేజ్ లో వినాయకుడు సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది? తెలుగులో "ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే" సినిమాని తమిళ్లో "యారిదే నీ మోహిని" పేరుతొ రిమేక్ చేశారు. ఆ సినిమాలో నేను నటించాను. దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాని చూసినప్పుడు "విలేజ్ లో వినాయకుడు" సినిమాకి సూట్ అవుతానని నన్ను ఎంపిక చేశారు. అల నేను తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాను. దర్శకుడు సాయి కిరణ్, హీరో కృష్ణుడు తో పని చేయడం మీకు ఎలా ఉంది? మొదట నిర్మాత మహి గారు కృష్ణుడు ఫోటో చూపించినప్పుడు కాస్త భయపడ్డాను. కాని తర్వాత ఆయనతో నటించడం చాలా హ్యాపి గా అనిపించింది. సినిమాలో హీరో ను నేను సరదాగా చిన్ను అని పిలుస్తాను. భయట మాత్రం గుమ్మడికాయ అని పిలుస్తాను. ఇక దర్శకుడు సాయి కిరణ్ నాకు ఈ సినిమాలో బాగా హెల్ప్ చేశారు. ప్రతి విషయం చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క విషయంలో కేర్ తీసుకున్నారు.
|
 |
మీకు నచ్చిన హీరో, హీరోయిన్? నాకు నచ్చిన హీరోలు మోహన్ లాల్, కమల్ హాసన్.
|
మీకు నచ్చిన ప్రదేశం, ఫుడ్, హాబీస్ గురించి చెపుతారా? నా నచ్చిన ప్లేస్, మా ఇల్లు, నా బెస్ట్ ఫ్రెండ్ సుకన్య(నా సోదరి), ఇక నా హాబీస్ అంటే మ్యూజిక్ వినడం, టీవీ చూడడం.
|
|
|
|
|