| కృష్ణుడు ఇంటర్వ్యూ |
Interviews |
 |
| హ్యాపీ డేస్ సినిమా తో పరిచయం అయిన కృష్ణుడు వినాయకుడు సినిమా తో హీరో గా తనకంటూ సినీ పరిశ్రమలో ఒక గుర్తింపు తెచ్చుకొన్న కృష్ణుడు తో మాట మంతి
|
మీ గురించి? మీ సినీ జీవితం ఎలా మొదలైంది? నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. నాకు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. బెంగళూరు లో పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్ లో దేవదాస్ కనకాల గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను.
|
"వినాయకుడు" సినిమాకి అవకాశం ఎలా వచ్చింది? శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో "హ్యాపీ డేస్" చిత్రం చేస్తున్నప్పుడు సాయి కిరణ్ అడవి గారు నన్ను చూసి వినాయకుడు సినిమాకి ఎంపిక చేసుకున్నారు.
|
|
వినాయకుడు సినిమాకి విలేజ్ లో వినాయకుడు సినిమాకి తేడా ఏమిటి? వినాయకుడు సినిమా మెట్రో లైఫ్ కి సంబంధించిన కథ. అంటే విలేజ్ నుంచి సిటీ కి వచ్చి బతుకుతాడు. కాని విలేజ్ లో వినాయకుడు సినిమా మొత్తం ఆపోజిట్ గా ఉంటుంది(సిటీ నుండి విలేజ్ కి వెళతాడు). మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? "అమాయకుడు" సినిమా చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య తో ఆయన ఫ్రెండ్ గా ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత "అష్టా చెమ్మ" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన పసుపతి గారి దర్శకత్వంలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను, సుబ్బరాజు ఇద్దరం హీరోలుగా నటిస్తున్నాము.
|
 |
మీరు ఎలాంటి పాత్రలు, ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాకు "ఓయ్" సినిమాలో చేసిన పాత్రకి మంచి పేరు తీసుకొచ్చింది. కామెడీ తరహ నే కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను.
|
మీ హీరోయిన్ ల గురించి చెప్పండి?(సోనియా, శరణ్య) సోనియా వినాయకుడు సినిమాకంటే ముందే హ్యాపీ డేస్ చిత్రం తో పరిచయం ఉంది. ఆమెతో నటించడం చాలా హాపీ గా ఉంది. అలాగే విలేజ్ లో వినాయకుడు సినిమాకి మంచి తెలుగింటి ఆడపడుచు లా కనిపించాలని శరణ్య ని ఎంపిక చేసుకున్నారు. ఈమెతో నటించడం కూడా హాపీ ఉంది.
|
మీకు నచ్చిన హీరో, హీరోయిన్? సీనియర్స్ లో ఎన్.టి. రామారావు గారు, తాజగా అయితే కమల్ హాసన్ ఇక హీరోయిన్ అయితే త్రిష.
|
 |
దర్శకుడు సాయి కిరణ్ పై మీ అభిప్రాయం? సాయి కిరణ్ గారు మంచి డైరెక్టర్, ఆయనతో చేయడం చాలా సంతోషంగా ఉంది.
|
|
|
|
|